మన్మధుడు మళ్ళీ చూసాను…

అబ్బా ఎన్నాళ్ళ తరవాతో మళ్ళీ మన్మధుడు సినిమా చూసాను. ఎన్ని సార్లు చూసినా చూడబుద్ధవుతుంది ఈ సినిమా.

ఎంత డీసెంట్ స్టొరీ, చక్కని హాస్యం ఉంటుంది ఈ సినిమాలో.

కొన్ని సీన్లయితే ఎప్పటికీ గుర్తుండిపోతాయి

– నాగార్జున ఆడాళ్ళ మీటింగు ని ఉప్పర మీటింగ్ అనటం

– లిప్స్టిక్ పెదాలకే ఎందుకు రాసుకోవాలి కళ్ళకి ఎందుకూ రాసుకోకూడదు అనే అయిడియా రావడం

– ధర్మవరపు సుబ్రమణ్యం ఆకాశం ఎర్రగా ఉంది సీను

-ఇక బ్రహ్మానందం సీన్లకయితే లెక్కే లేదు, అన్నీ కామెడీ గుళికలే.. ముఖ్యం గా ఆ ఎయిర్ పోర్టు సీను.
ఇండియా ని టేప్ రెకార్డర్ లో పెట్టి యాభై ఏళ్ళు ముందుకు తిప్పితే అదే పారిస్ అని డబ్బాలు కొడుతూ, ఎస్కలేటర్ ఏంటొ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే, అయ్యో మాస్టారూ ఇలా దిగాలని తెలీక మామూలుగా దిగేసాం అని నాగార్జున తిక్క కుదిర్చే సీను.

-ఇక సునీల్ చీటికీ మాటికీ కోపం గా అరిచే సీన్లు.

అబ్బో ఒకటేంటి

అసలు కామెడీ ఈ సినిమాకే హైలైటు.

ఇంత చక్కని సినిమాలు ఒప్పుకోక నాగార్జున కి ఈ బాస్ లాంటి చెత్త సినిమాలు ఎందుకో. అవునులే చెత్త సినిమాలు లేకపోతే మంచి సినిమాల విలువెలా తెలుస్తుంది ?

ఇలాంటి ఇంకెన్నో మంచి సినిమాలు రావాలని ఆశిద్దాము.

అన్నట్టు నేను కూడా యాభై పోస్టులు పూర్తి చేసుకున్నానండోయ్.