Gaim…

మీరు ఎన్నో “IM” (Internet Messenger) లు వాడుతుంటారు. అన్నిటినీ లోకీ లాగిన్ అయ్యి వాటికోసం టాస్క్ బార్ లో అంత ప్రదేశం కేటాయించాలంటే కష్టమే కదా.

అందుకనే నేను gaim వాడతాను.

ఇదో Open Source సాఫ్ట్ వేర్. ఇది Yahoo, MSN, Google Talk, AIM, Jabber, ICQ, Sametime మొదలయిన ఎన్నో IMs తో పని చెయ్యగలదు.

అన్నీ విడి విడిగా తెరచి ఉంచక్కర్లేకుండా అన్నిటినీ కలిపి gaim లో తెరవవచ్చు. అదే కాకుండా ఇందులో కొన్ని ప్రత్యేకమయిన సదుపాయాలు ఉన్నాయి. ఏంటంటే వేరే IM లలో మీరు ఒకసారి ఒకే అకౌంట్ లో లాగిన్ అయ్యి ఉండగలరు. కానీ gaim ఉపయొగించి ఒకేసారి ఒకే IM కి సంబంధించిన ఎన్నయినా అకౌంట్లలో లాగిన్ అయ్యి ఉండవచ్చు (మీ స్నేహితులకొకటి, మీ గర్ల్ ఫ్రెండ్ కోసం ఒకటి అన్నమాట 😉 ).

అదే కాక ఎన్నో పెద్ద కంపనీలు వాడే IBM వారి Sametime ని కూడా ఇది support చేస్తుంది. కాబట్టి మీ కార్పోరేట్ మెసంజర్ లను కూడా ఇందులో నిక్షిప్తం చేసుకోవచ్చు అన్నమాట .

దీనికి ఎన్నో చక్కటి plugins కూడా ఉన్నాయి. నాకు అన్నిటికన్నా నచ్చింది psychic mode అనే plugin. ఇదేంటి అంటే అవతలి వారు మీకు మెసేజ్ పంపుదామని IM window తెరిస్తే చాలు. మీకు ఇక్కడ తెలిసిపోతుంది. వారు మెసేజ్ పంపకముందే మీకు తెలిసిపోతుంది. అదే మరి. అలాగే మీరు వింటున్న సంగీతం, పాటలు మీ IM status గా మార్చే plugin కూడా ఉంది. ఇలాంటివెన్నో.

ఇది మొదట లినక్స్ కోసం తయారు చెయ్యబడినది, కానీ తరవాత GTK ని విండోస్ కి port చెయ్యడంతో సుబ్బరంగా విండోస్ లో కూడా వాడుకునే వీలు వచ్చింది. ప్రయత్నించండి మరి.