virtualization, vmware…..

virtualization అనేది ఎంతగానొ వ్యాప్తి చెందుతుంది ఈ మధ్య. దీని వల్ల ఎన్నో ఉపయోగాలు.

ఉదహరణకి మీరు ఒకే సారి రెండు Operating Systems run చెయ్యలి అనుకోండి. మీరు సాధరణంగా చేసేది dual boot.
కానీ అలా కాకుండా ఒకేసారి పక్క పక్కన కావాలనుకోండి అప్పుడు ఏమి చేస్తారు ?

ఇలాంటి సమస్యల తీర్చడానికే virtualization అనే టెక్నాలజీ. దీనిని ఉపయొగించి మనం ఎన్నయినా operating systems ఒకే system మీద run చెయ్యగలుగుతాము (మీ system configuration support చేస్తే). అదీ reboot చెయ్యనవసరము లేకుండా.

virtualization కోసం ఉన్న ఎన్నో సాఫ్ట్ వేర్ లలో vmware ఒకటి. అలాగే microsoft వారి virtual server కూడా ఒకటి. ఈ రెండూ కూడా ఉచితమే. వీటిని ఉపయొగించి మీరు పైన చెప్పుకున్న దానిని సాధించవచ్చు.

మీరు మొదట vmware server ని download చేసుకోవలి. (ఇది windows మరియు లినక్స్ operating systems కొరకు లభ్యం). ఇది install చేసుకున్న తరువాత మీరు ఒక కొత్త virtual machine create చెయ్యవచ్చు. మీకు కావలసిన configuration తో ఒక కొత్త virtual machine create చెసుకోవచ్చు. (మీకు కావలసిన memory, cpu మొదలయినవి)

ఉదాహరణకి మీరు XP వాడుతున్నారనుకోండి, మీకు మీ system మీద లినక్స్ కావలంటే మీరు ఒక కొత్త virtual machine create చేసి, లినక్స్ CD ని CD drive లో ఉంచి, ఆ కొత్త virtual machine ని boot చెస్తే సరి. మీరు మాములుగా install చెసినట్టే దంట్లో install చెసెయ్యండి. అంతే మీకు కావలసిన operating system తయారు. ఇలా మీరు ఎన్నయినా install చేసుకోవచ్చు.

ఇదంతా పెద్ద తతంగం అనుకుంటే దానికి సులభ మార్గం కూడా ఉంది.

మీరు vmware గనక ఉపయొగిస్తుంటె virtual appliances అని ఉంటాయి. ఇవి మిగతా వాళ్ళు తయారు చేసినవి అన్నమాట. దాదాపు అన్ని operating systems యొక్క virtual appliances అక్కద లభ్యం. వీటిని download చెసుకొని start చెస్తే చాలు. మీకు ఆ operating system వచ్చేసినట్టే.

లినక్స్ పైన కనుక మీకు vitualization products కావాలంటే xen అని ఇంకోటి కూడా ఉంది.

ఇంకా ఎక్కువ వివరంగా చెప్పల్సింది కానీ ఓపిక లేదు 🙂