Yahoo! Pipes

Yahoo! Pipes అనే ఒక కొత్త application ని Yahoo! విడుదల చేసింది.

Unix, Linux లో పని చేసిన వారెవరికయినా pipes తెలిసే ఉంటుంది. ఒక command ని మరోదానికి జత చేసేందుకు ఉపయొగపడుతుంది. ఒక దాని result ని వేరే దానికి పంపి మనకు కావలసిన పనిని రాబట్టుకోవచ్చు.

Yahoo! Pipes ని దీనికి analogous గా చెబుతున్నారు కాకపోతే ఇది commands కి బదులుగా web content కి సంబంధించినది. ఇది అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టంగానే ఉన్నా దీని ఉపయొగాలు అనంతంగా కనిపిస్తున్నాయి.

ముందుగా interface గురించి చెప్పుకుంటే కొద్దిగా complex గానే తయారు చేసారు. intuitive గా లేదు. సరే కానీ visual representation బాగుంది. అంటే మనం తయారు చేసే pipes ని మనకు ఒక flow chart గా చూపిస్తున్నారు. అదే గాక drag and drop లో దీనిని నిర్మించవచ్చు.

ఇక దీని ఉపయోగాలంటారా ? ఎన్నో…
web content ని మనకు కావలసినట్టు mix and match చేసుకునే విధంగా ఎన్నో options ఉన్నాయి. అందులో ఒకటి చూద్దాము.

మీరు ఎన్నో RSS feeds ఉపయొగిస్తుంటారు. కానీ అన్నీ కలిపి ఒకే feed లాగా వస్తే బాగుండు అనుకున్నారనుకోండి. అది దీనితో సాధ్యం. అలా కాక మీకు కావలసిన categories లో feeds అన్నీ విడి విడిగా సర్దాలనుకున్నారనుకోండి అది కూడ సాధ్యమే.

ఎలా అంటే కింద చూడండి.

ఇక్కడ Fetch, Filter, Sort, Pipe Output modules ఉపయొగించాను. ఆఖరిగా వచ్చిన URL ని ఉపయొగిస్తే మీ feed రెడీ.

పైన చూపించింది ఒక ఉదాహరణ మాత్రమే. దీనికంటే ఎంతో advanced సాధ్యమే.

ఉదాహరణకి మీకు కావలసిన content ని అంతా మీకు కావలసిన భాషలోకి మార్చుకునేందుకు “babelfish” అనే module ని ఉపయొగించుకోవచ్చు. లేకపోతే content analysis చేసి దాంట్లోంచి flickr ఫొటోస్ రాబట్టొచ్చు. ఇంకా ఎన్నో చెయ్యచ్చు.

ఉపయొగించి చూడండి.