రిజర్వేషన్ల వల్ల మంచి జరుగుతుందా ?

రిజర్వేషన్ల వల్ల మంచి జరుగుతుంది అంటే నేను అసలు ఒప్పుకోను. అది ఎప్పటికయినా చెడే చేస్తుంది. ఎప్పుడో ఎన్నాళ్ళ క్రితమో కులాల, మతాల ప్రాతిపదికన చేసిన రిజర్వేషన్లను మన దగా రాజకీయ నాయకులు ఇంత వరకూ వాడుకుంటూనే ఉన్నారు. ఎప్పుడో వర్తించిందని ఇప్పుడు కూడా వర్తిస్తుందని అనుకోవడం ఎంత వరకూ సమంజసమో నాకు తెలీదు. ఒక వేళ అలాగే అనుకున్నా ఇంత కాలం ఆ రిజర్వేషన్ల వల్ల జరగని మంచి ఇక ముందు మాత్రం జరుగుతుందని నమ్మకమేంటి. ఒక సారి రిజర్వేషన్లు వర్తింపచెయ్యడమే కానీ, అది తీసేసే దమ్ము ఎవరికీ లేదు.

మంచి రాంకు వచ్చి కాలేజీలో సీటు కోసం ప్రయత్స్నిస్తుంటే పక్కన రాంకు రాని వారూ, అన్నీ ఎక్కువగానే ఉన్నా (రాంకు తప్ప) రిజర్వేషను ఉంది అన్న ఒక్క సాకుతో మన ముందే సీట్లు తన్నుకుపోతుంటే ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను.

మహిళా బిల్లో, రిజర్వేషన్లో అంటూ గగ్గోలు పెడుతున్నారు. అసలు బిల్లు తెస్తే సరిపొతుందా ? వారికి తగిన క్వాలిఫికేషన్స్ అక్కర్లేదా ? ముందు వారిని సరయిన మార్గాన పైకి తేవడం గురించి అలోచించకుండా రిజర్వేషన్లు తెస్తే సరిపోతుంది అన్నట్టుగా అందరూ మాట్లాడటం నాకు చిరాకు తెప్పిస్తుంది.

రేపటి నుంచి టికెట్ దక్కని ప్రతీ రాజకీయ నాయకుడి అక్షరమ్ముక్క చదవని భార్యలు కూడా అసెంబ్లీ లో కూర్చుంటారు. వారు చేసేది దేశానికి మంచా ??

దళితుల మీద అన్యాయం జరిగింది, జరుగుతుంది ఒప్పొకుంటాను, కానీ రిజర్వేషన్ల వల్ల దాంట్లో ఏ మార్పు వచ్చింది ? అంటే ఈ విధానం సరిగా పని చెయ్యట్లేదనే గా ? మరి అలాంటప్పుడు దానికి ప్రత్యామ్నాయం అలోచించాలిగా ?

అలాగని ఇక్కడ నేను రిజర్వేషన్లు ఉన్న వారినీ, మహిళలని కించపరచట్లేదు. ఎంతో మంది ఉన్నతంగా ఉన్నారు, మంచి పనులు చేస్తున్నారు, దక్షతా కలిగి ఉన్నారు. వారిని రానీండి, దానికోసం దారులు వెతకండి.

సమానం సమానం అంటూనే ఎంత సేపూ ప్రత్యేకంగా చూడాలనటమే మనం చేసే మొదటి తప్పు అని నా అభిప్రాయం.

నేను అనుకున్నది చెప్పాను, ఎవరినయినా బాధిస్తే నేనేమీ చెయ్యలేను. క్షమించమని అడగను.

24 thoughts on “రిజర్వేషన్ల వల్ల మంచి జరుగుతుందా ?

  1. నా అభిప్రాయం కూడా ఇదే…..రిజర్వేషన్లు అడిగేవాళ్ళు సిగ్గుపడాలి. చేతకాని వాళ్ళే అలా అడుగుతారు. ఈ రాజకీయ నాయకులకు దమ్ముంటే పేదలకు రిజర్వేషన్లు ఇమ్మను.

  2. నా అభిప్రాయం కూడా ఇదే…..రిజర్వేషన్లు అడిగేవాళ్ళు సిగ్గుపడాలి. చేతకాని వాళ్ళే అలా అడుగుతారు. ఈ రాజకీయ నాయకులకు దమ్ముంటే పేదలకు రిజర్వేషన్లు ఇమ్మను.

  3. నేనూ మౌలికంగా రిజర్వేషన్‌లకి వ్యతిరేకమే. కాని రిజర్వేషనిస్టుల భయాల్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో పచ్చి కులగజ్జి ఉంది.పరమ పనికిమాలిన అంట్ల వెధవల్ని కూడా తమ కులస్తుడన్న ఏకైక కారణంతో అందలమెక్కించే (అగ్రకులాల) అక్కుపక్షులు ఉన్నారిక్కడ. ఇలాంటి వాతావరణంలో బొత్తిగా రిజర్వేషన్లే లేని పరిస్థితి ఊహించుకుంటేనే భయమేస్తోంది. మళ్ళీ మనం ప్రజాస్వామ్య యుగం నుంచి బానిసయుగంలోకి వెళతామేమో ! ఈ రిజర్వేషన్లు ఇచ్చింది అగ్రకులస్తులే. అన్ని వందలమంది అగ్రకుల మేధావులు ఏమీ ఆలోచించకుండానే రిజర్వేషన్లు ఇచ్చారంటారా ? దీని గురించి చెప్పాలంటే చాలా ఉంది. నా బ్లాగులోనే ఏదో ఒక రోజు బ్లాగుతా లెండి.

  4. నేనూ మౌలికంగా రిజర్వేషన్‌లకి వ్యతిరేకమే. కాని రిజర్వేషనిస్టుల భయాల్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో పచ్చి కులగజ్జి ఉంది.పరమ పనికిమాలిన అంట్ల వెధవల్ని కూడా తమ కులస్తుడన్న ఏకైక కారణంతో అందలమెక్కించే (అగ్రకులాల) అక్కుపక్షులు ఉన్నారిక్కడ. ఇలాంటి వాతావరణంలో బొత్తిగా రిజర్వేషన్లే లేని పరిస్థితి ఊహించుకుంటేనే భయమేస్తోంది. మళ్ళీ మనం ప్రజాస్వామ్య యుగం నుంచి బానిసయుగంలోకి వెళతామేమో ! ఈ రిజర్వేషన్లు ఇచ్చింది అగ్రకులస్తులే. అన్ని వందలమంది అగ్రకుల మేధావులు ఏమీ ఆలోచించకుండానే రిజర్వేషన్లు ఇచ్చారంటారా ? దీని గురించి చెప్పాలంటే చాలా ఉంది. నా బ్లాగులోనే ఏదో ఒక రోజు బ్లాగుతా లెండి.

  5. @బాలసుబ్రహ్మణ్యం గారూ :

    లేదండీ అలోచించకుండా ఇచ్చింది అని నేను అనను.
    పరిస్థితుల బట్టి అప్పుడది తప్పకుండా అవసరం అయి ఉండవచ్చు. మరి అది సరిగా అమలు జరగనప్పుడు పంథా మార్చాలిగా మరి. లేకపోతే అసలు సమీక్ష అన్నా జరగాలి గా దీని మీద.
    ఏదీ లేక ఊరికే నేను రిజర్వేషన్లు పెంచుకుంటా పోతా, లేని వాళ్ళు మీ చావు మీరు చావండి అంటే ?

    అదీ కాక ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్లలో, ఐటి ఇండస్ట్రీలలోనూ వర్తింపచెయ్యాలని గొడవొకటి. ఇవన్నీ నైపుణ్యం మీద పని చేసేవి. అది ఉన్న వారిని ఎవరూ ఆపట్లేదు, లేని వారిని ఆదరించట్లేదు కూడాను. మరి ఇలాంటివన్నీ ఎంత వరకు సమంజసం అనేదే ???

  6. @బాలసుబ్రహ్మణ్యం గారూ :లేదండీ అలోచించకుండా ఇచ్చింది అని నేను అనను.పరిస్థితుల బట్టి అప్పుడది తప్పకుండా అవసరం అయి ఉండవచ్చు. మరి అది సరిగా అమలు జరగనప్పుడు పంథా మార్చాలిగా మరి. లేకపోతే అసలు సమీక్ష అన్నా జరగాలి గా దీని మీద.ఏదీ లేక ఊరికే నేను రిజర్వేషన్లు పెంచుకుంటా పోతా, లేని వాళ్ళు మీ చావు మీరు చావండి అంటే ?అదీ కాక ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్లలో, ఐటి ఇండస్ట్రీలలోనూ వర్తింపచెయ్యాలని గొడవొకటి. ఇవన్నీ నైపుణ్యం మీద పని చేసేవి. అది ఉన్న వారిని ఎవరూ ఆపట్లేదు, లేని వారిని ఆదరించట్లేదు కూడాను. మరి ఇలాంటివన్నీ ఎంత వరకు సమంజసం అనేదే ???

  7. ఎందుకండీ ప్రవీణ్ ఈ అంతులేని దురదని మళ్ళి గోకారు?

    ఈ రిజర్వేషన్ల మీద ఇంతకు మునుపు నేను రాసిన బ్లాగులు ఇక్కడ చూడండి.

    http://www.charasala.com/blog/?p=95
    http://www.charasala.com/blog/?p=22

    “అన్నీ ఎక్కువగానే ఉన్నా (రాంకు తప్ప) రిజర్వేషను ఉంది అన్న ఒక్క సాకుతో మన ముందే సీట్లు తన్నుకుపోతుంటే ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను.”
    ఇది మాత్రమే కాదు మీరు అర్థం చేసుకోవలసింది.
    “డబ్బుందన్న ఒక్క సాకుతో తనకంటే ఎంతో తక్కువ మార్కులు వచ్చిన పక్కింటి ధనవంతుల అబ్బాయి డొనేషన్ కట్టి ఇంజనీరింగ్ చేస్తుంటే, తను మాత్రం పొలంలో కూలికి పోవడాన్ని” అర్థం చేసుకోండి.

    “రేపటి నుంచి టికెట్ దక్కని ప్రతీ రాజకీయ నాయకుడి అక్షరమ్ముక్క చదవని భార్యలు కూడా అసెంబ్లీ లో కూర్చుంటారు. వారు చేసేది దేశానికి మంచా ??”
    “ఒక లాలూకు బార్య అయినందుకు రబ్రీ ముఖ్యమంత్రి అయితే, బొత్స సత్యనారాయణ బార్య MP అయితే, తమ్ముడు మేయర్ అయితే, జనార్దన రెడ్డి బార్య అయినందుకు రాజ్యలక్ష్మి మంత్రి అయితే, రాజశేఖర్ రెడ్డి తమ్ముడైనందుకు వివేకానంద రెడ్డీ MP, బామ్మరిది మేయర్, కొడుకు కాబోయే నాయకుడు, నెహ్రూ కూతురయినందుకు ఇందిరమ్మ ప్రధాన మంత్రి, ఆమె కొడుకైనందుకు రాజీవ్ ప్రధాన మంత్రి, ఆయన బార్య అయినందుకు సోనియా నాయకురాలు అయితే జరిగిన దేశానికి మంచి, రిజర్వేషన్ వున్నందుకు నూకాలమ్మ MPTC అయితేనే” దేశానికి మంచి జరగదా?

    రిజర్వేషన్లు మొత్తానికేమీ సాధించలేదనడం చుపులేకపోవడమే! కానీ సాధించాల్సింది ఎంతో వుంది. సాంఘిక అసమానత, కుల వివక్షల కారణంగా రిజర్వేషన్లు ఏర్పాటయితే అవి వున్నంత వరకూ ఇవీ వుండాల్సిందే!

    –ప్రసాద్
    http://blog.charasala.com

  8. ఎందుకండీ ప్రవీణ్ ఈ అంతులేని దురదని మళ్ళి గోకారు?ఈ రిజర్వేషన్ల మీద ఇంతకు మునుపు నేను రాసిన బ్లాగులు ఇక్కడ చూడండి. http://www.charasala.com/blog/?p=95http://www.charasala.com/blog/?p=22“అన్నీ ఎక్కువగానే ఉన్నా (రాంకు తప్ప) రిజర్వేషను ఉంది అన్న ఒక్క సాకుతో మన ముందే సీట్లు తన్నుకుపోతుంటే ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను.”ఇది మాత్రమే కాదు మీరు అర్థం చేసుకోవలసింది. “డబ్బుందన్న ఒక్క సాకుతో తనకంటే ఎంతో తక్కువ మార్కులు వచ్చిన పక్కింటి ధనవంతుల అబ్బాయి డొనేషన్ కట్టి ఇంజనీరింగ్ చేస్తుంటే, తను మాత్రం పొలంలో కూలికి పోవడాన్ని” అర్థం చేసుకోండి.”రేపటి నుంచి టికెట్ దక్కని ప్రతీ రాజకీయ నాయకుడి అక్షరమ్ముక్క చదవని భార్యలు కూడా అసెంబ్లీ లో కూర్చుంటారు. వారు చేసేది దేశానికి మంచా ??” “ఒక లాలూకు బార్య అయినందుకు రబ్రీ ముఖ్యమంత్రి అయితే, బొత్స సత్యనారాయణ బార్య MP అయితే, తమ్ముడు మేయర్ అయితే, జనార్దన రెడ్డి బార్య అయినందుకు రాజ్యలక్ష్మి మంత్రి అయితే, రాజశేఖర్ రెడ్డి తమ్ముడైనందుకు వివేకానంద రెడ్డీ MP, బామ్మరిది మేయర్, కొడుకు కాబోయే నాయకుడు, నెహ్రూ కూతురయినందుకు ఇందిరమ్మ ప్రధాన మంత్రి, ఆమె కొడుకైనందుకు రాజీవ్ ప్రధాన మంత్రి, ఆయన బార్య అయినందుకు సోనియా నాయకురాలు అయితే జరిగిన దేశానికి మంచి, రిజర్వేషన్ వున్నందుకు నూకాలమ్మ MPTC అయితేనే” దేశానికి మంచి జరగదా?రిజర్వేషన్లు మొత్తానికేమీ సాధించలేదనడం చుపులేకపోవడమే! కానీ సాధించాల్సింది ఎంతో వుంది. సాంఘిక అసమానత, కుల వివక్షల కారణంగా రిజర్వేషన్లు ఏర్పాటయితే అవి వున్నంత వరకూ ఇవీ వుండాల్సిందే!–ప్రసాద్http://blog.charasala.com

  9. ఇదిగో 21వ శతాబ్దంలో కూడా మనం మనుషుల్లా జీవించలేక పోతున్నాం. హిందూలో ఇది చదవండి. అందించిన రవి వైజాసత్య కు కృతజ్ఞతలు.

    http://www.hinduonnet.com/fline/fl2210/stories/20050520002603900.htm

    –ప్రసాద్
    http://blog.charasala.com

  10. ఇదిగో 21వ శతాబ్దంలో కూడా మనం మనుషుల్లా జీవించలేక పోతున్నాం. హిందూలో ఇది చదవండి. అందించిన రవి వైజాసత్య కు కృతజ్ఞతలు.http://www.hinduonnet.com/fline/fl2210/stories/20050520002603900.htm–ప్రసాద్http://blog.charasala.com

  11. @spandana: ఈ రిజర్వేషన్ల మీద ఇంతకు మునుపు నేను రాసిన బ్లాగులు ఇక్కడ చూడండి.
    నేను అప్పటికి ఇంకా తెలుగు బ్లాగులలో లేనండీ…కాబట్టి క్షమించాలి.

    మీరు నా టపా ను ఆసాంతం చదివినట్టు లేదు. రిజర్వేషన్ల ప్రాతిపదిక మార్చాలన్నది కూడా నా ఉద్దేశ్యము. అవును ఎప్పుడూ ఎక్కడో ఒక చోట ఎవరికో ఒకరికి అన్యాయం జరుగుతూనే ఉంటుంది. ఆ జరిగిన అన్యాయం ఎలా జరగకూడదో ఆలోచించకుండా రిజర్వేషన్లను పెంచితే సరిపోతుంది అన్న వాదనను నేను ఎప్పటికీ సమర్థించను. “They are just solving the wrong problem”.

    డబ్బుందన్న ఒక్క సాకుతో తనకంటే ఎంతో తక్కువ మార్కులు వచ్చిన పక్కింటి ధనవంతుల అబ్బాయి డొనేషన్ కట్టి ఇంజనీరింగ్ చేస్తుంటే, తను మాత్రం పొలంలో కూలికి పోవడాన్ని
    దీనికి కులం ఎలా వర్తిస్తుందండీ ? ఏ కులమయినా పేద వాడు ఆ స్థితిలో అలాగే అనుకుంటాడు. మళ్ళీ అందుకే చెబుతున్నా we are solving the wrong problem అని. ఆ కారణం అయిన పేదరికాన్ని నిర్మూలించేలా ప్రయత్నాలు చేబట్టాలి. లేదా అలా పేద వారికి ఉచితంగా లేక సబ్సిడీ ఫీజులు అందించాలి. ఇవన్నీ నేను కాదనను. ఇప్పుడున్న ప్రాతిపదికే నాకు నచ్చలేదు.

    రిజర్వేషన్ వున్నందుకు నూకాలమ్మ MPTC అయితేనే” దేశానికి మంచి జరగదా?
    మీరంటున్నారే అంత మంది రాగా లేంది ఇంకొకరు వస్తే నష్టమా అని ? మీ ఇల్లు పది మంది దొంగలు దోచుకుంటే అంత మంది దోచుకున్నారు కదా అని పదకొండో వాడికి రా దోచుకో అని చెప్తారా ?

    అవునండీ అందరికీ “Big Picture” కావాలి. అయ్యో నాకు ఇప్పుడు అన్యాయం జరిగింది ఫరవాలేదు, దీని వల్ల ఎందరికో ఎంతో న్యాయం జరగొచ్చు అని ఎందరు అలోచించగలరు ? పర్వాలేదు నీ కెరీర్ నాశనం అయిపోయినా చూడు అక్కడ ఇంకెవరో నీ బదులు చదువుకుంటున్నారు. అందుకని సంతోషపడు అని పిల్లలకి చెప్పగలమా ? అందరూ మీలాగా అలోచించలేకపోవచ్చు ఎందుకంటే జనాలకి ఎప్పుడూ “నేను”, “మనం” కంటే ముందు వస్తుంది. అది తప్పు కాదు అని నా అభిప్రాయం కూడా. అవును నేను mature thinker ని కాకపోవచ్చు.

    మీరు పంపించిన link చూసాను.
    ఒప్పుకుంటాను. అలా జరిగి ఉండవచ్చు. అయితే రిజర్వేషన్ల అమలులో చిక్కు ఇది. దీనిని అరికట్టడానికి ప్రభుత్వం ఖచ్చితమయిన చర్యలు తీసుకోవాలి. ఎవరయినా అనవసరంగా ఇలాంటి పనులు చేస్తే strict discrimination laws తీసుకురావాలి.

    మనిద్దరి అలోచనలు కలవకపోవచ్చు, I respect your opinion. You are entitled to it.

    ఈ పోస్టు చాలా మంది nerve touch చేస్తుందని అనుకోలేదు. ఇక దీని మీద డిస్కషను పొడిగించను. సరేనా ?

  12. @spandana: ఈ రిజర్వేషన్ల మీద ఇంతకు మునుపు నేను రాసిన బ్లాగులు ఇక్కడ చూడండి. నేను అప్పటికి ఇంకా తెలుగు బ్లాగులలో లేనండీ…కాబట్టి క్షమించాలి.మీరు నా టపా ను ఆసాంతం చదివినట్టు లేదు. రిజర్వేషన్ల ప్రాతిపదిక మార్చాలన్నది కూడా నా ఉద్దేశ్యము. అవును ఎప్పుడూ ఎక్కడో ఒక చోట ఎవరికో ఒకరికి అన్యాయం జరుగుతూనే ఉంటుంది. ఆ జరిగిన అన్యాయం ఎలా జరగకూడదో ఆలోచించకుండా రిజర్వేషన్లను పెంచితే సరిపోతుంది అన్న వాదనను నేను ఎప్పటికీ సమర్థించను. “They are just solving the wrong problem”.డబ్బుందన్న ఒక్క సాకుతో తనకంటే ఎంతో తక్కువ మార్కులు వచ్చిన పక్కింటి ధనవంతుల అబ్బాయి డొనేషన్ కట్టి ఇంజనీరింగ్ చేస్తుంటే, తను మాత్రం పొలంలో కూలికి పోవడాన్నిదీనికి కులం ఎలా వర్తిస్తుందండీ ? ఏ కులమయినా పేద వాడు ఆ స్థితిలో అలాగే అనుకుంటాడు. మళ్ళీ అందుకే చెబుతున్నా we are solving the wrong problem అని. ఆ కారణం అయిన పేదరికాన్ని నిర్మూలించేలా ప్రయత్నాలు చేబట్టాలి. లేదా అలా పేద వారికి ఉచితంగా లేక సబ్సిడీ ఫీజులు అందించాలి. ఇవన్నీ నేను కాదనను. ఇప్పుడున్న ప్రాతిపదికే నాకు నచ్చలేదు.రిజర్వేషన్ వున్నందుకు నూకాలమ్మ MPTC అయితేనే” దేశానికి మంచి జరగదా?మీరంటున్నారే అంత మంది రాగా లేంది ఇంకొకరు వస్తే నష్టమా అని ? మీ ఇల్లు పది మంది దొంగలు దోచుకుంటే అంత మంది దోచుకున్నారు కదా అని పదకొండో వాడికి రా దోచుకో అని చెప్తారా ?అవునండీ అందరికీ “Big Picture” కావాలి. అయ్యో నాకు ఇప్పుడు అన్యాయం జరిగింది ఫరవాలేదు, దీని వల్ల ఎందరికో ఎంతో న్యాయం జరగొచ్చు అని ఎందరు అలోచించగలరు ? పర్వాలేదు నీ కెరీర్ నాశనం అయిపోయినా చూడు అక్కడ ఇంకెవరో నీ బదులు చదువుకుంటున్నారు. అందుకని సంతోషపడు అని పిల్లలకి చెప్పగలమా ? అందరూ మీలాగా అలోచించలేకపోవచ్చు ఎందుకంటే జనాలకి ఎప్పుడూ “నేను”, “మనం” కంటే ముందు వస్తుంది. అది తప్పు కాదు అని నా అభిప్రాయం కూడా. అవును నేను mature thinker ని కాకపోవచ్చు.మీరు పంపించిన link చూసాను.ఒప్పుకుంటాను. అలా జరిగి ఉండవచ్చు. అయితే రిజర్వేషన్ల అమలులో చిక్కు ఇది. దీనిని అరికట్టడానికి ప్రభుత్వం ఖచ్చితమయిన చర్యలు తీసుకోవాలి. ఎవరయినా అనవసరంగా ఇలాంటి పనులు చేస్తే strict discrimination laws తీసుకురావాలి.మనిద్దరి అలోచనలు కలవకపోవచ్చు, I respect your opinion. You are entitled to it.ఈ పోస్టు చాలా మంది nerve touch చేస్తుందని అనుకోలేదు. ఇక దీని మీద డిస్కషను పొడిగించను. సరేనా ?

  13. ప్రవీణ్, నేను పూర్తిగా ఏకిభవిస్తాను. చారసాల గారు చెప్పినట్టు ఈ విషయంపై అందరూ ఓసారి కొట్టేసుకున్నారు (సరదాకే లెండి). నేను అప్పుడు చెప్పిందే ఇప్పుడూ చెబుతాను. ఏమన్నా ఇస్తే, అదీ scholarships, financial aid etc ఆర్థికంగా వెనుకబడినవాళ్ళకి ఇవ్వాలి అని. కుల/మత ప్రాతిపదికన కాదు అని. ఇంక లోక్‌సభ లో మహిళలకి రిజర్వేషన్ ఎందుకు? నేను ప్రజల representativeని అయినప్పుడు, నేను “leader”ని అయినప్పుడు, నేను పురుషులతో సమానం అయినప్పుడు, వాళ్ళతో పోటీపడి సాధించుకోవాలి. నేను పురుషులతో సమానం అంటూ, ఇంకా పోతే వాళ్ళకన్న ఎక్కువ అంటూనే నాకు రిజర్వేషన్ అడగటం contradictory కాదా? ఎవరో నాతో అసభ్యంగా behave చేస్తే వాళ్ళని రిజర్వేషన్ ఆపుతుందా? వాళ్ళని ఈడ్చిపెట్టీ కొట్టే ధైర్యం నాలో ఉండాలి. బుద్దొచ్చేలా తన్నే సభ్యత చుట్టూ ఉన్నవాళ్ళకి ఉండాలి. ఆ దిశలో మనం మారాలి. మహిళలనే కాదు, ఎవరైన సరే, బలహీనవర్గాలు అని చెప్పబడుతున్నవారిని సరైన మార్గాన పైకి తేవాటానికే కాదు, చారసాలగారు ఇచ్చిన లింక్ లో ఉన్న అవతలి వర్గాలకి against గా బలమైన చర్యలు కూడా తీసుకోవాలి. మొత్తం సమస్య సరయిన దిశలో solve చేయాలి కానీ (నా అభిప్రాయంలో అవసరం లేని, problem solve చేయలేని) రిజర్వేషన్ ఇచ్చి చేతులు దులుపేసుకోవటం సరికాదు.

    చారసాలగారు ఇచ్చిన లింక్‌లో విషయం దారుణం. మనం ఎక్కడున్నాం అనిపిస్తుంది? కానీ దాంట్లోనే ఇంకో విషయం గమనించాలి, అక్కడ రిజర్వేషన్ work చేయలేదు. కారణం అవతలివర్గం బలవంతుడు కావటం..(నేను డబ్బున్న వాడు అంటాను, మరొకరు అగ్రకులస్తుడు అంటారు, కారణం ఏదైన కావచ్చు). So can I infer that the solution is much beyond reservation?

  14. ప్రవీణ్, నేను పూర్తిగా ఏకిభవిస్తాను. చారసాల గారు చెప్పినట్టు ఈ విషయంపై అందరూ ఓసారి కొట్టేసుకున్నారు (సరదాకే లెండి). నేను అప్పుడు చెప్పిందే ఇప్పుడూ చెబుతాను. ఏమన్నా ఇస్తే, అదీ scholarships, financial aid etc ఆర్థికంగా వెనుకబడినవాళ్ళకి ఇవ్వాలి అని. కుల/మత ప్రాతిపదికన కాదు అని. ఇంక లోక్‌సభ లో మహిళలకి రిజర్వేషన్ ఎందుకు? నేను ప్రజల representativeని అయినప్పుడు, నేను “leader”ని అయినప్పుడు, నేను పురుషులతో సమానం అయినప్పుడు, వాళ్ళతో పోటీపడి సాధించుకోవాలి. నేను పురుషులతో సమానం అంటూ, ఇంకా పోతే వాళ్ళకన్న ఎక్కువ అంటూనే నాకు రిజర్వేషన్ అడగటం contradictory కాదా? ఎవరో నాతో అసభ్యంగా behave చేస్తే వాళ్ళని రిజర్వేషన్ ఆపుతుందా? వాళ్ళని ఈడ్చిపెట్టీ కొట్టే ధైర్యం నాలో ఉండాలి. బుద్దొచ్చేలా తన్నే సభ్యత చుట్టూ ఉన్నవాళ్ళకి ఉండాలి. ఆ దిశలో మనం మారాలి. మహిళలనే కాదు, ఎవరైన సరే, బలహీనవర్గాలు అని చెప్పబడుతున్నవారిని సరైన మార్గాన పైకి తేవాటానికే కాదు, చారసాలగారు ఇచ్చిన లింక్ లో ఉన్న అవతలి వర్గాలకి against గా బలమైన చర్యలు కూడా తీసుకోవాలి. మొత్తం సమస్య సరయిన దిశలో solve చేయాలి కానీ (నా అభిప్రాయంలో అవసరం లేని, problem solve చేయలేని) రిజర్వేషన్ ఇచ్చి చేతులు దులుపేసుకోవటం సరికాదు.చారసాలగారు ఇచ్చిన లింక్‌లో విషయం దారుణం. మనం ఎక్కడున్నాం అనిపిస్తుంది? కానీ దాంట్లోనే ఇంకో విషయం గమనించాలి, అక్కడ రిజర్వేషన్ work చేయలేదు. కారణం అవతలివర్గం బలవంతుడు కావటం..(నేను డబ్బున్న వాడు అంటాను, మరొకరు అగ్రకులస్తుడు అంటారు, కారణం ఏదైన కావచ్చు). So can I infer that the solution is much beyond reservation?

  15. రిజర్వేషన్లు అమలు పరచేవారు, రిజర్వేషన్లు అందుకోనేవారు నిబద్దత పాటిస్తే ఎటువంటి వాదవివాదాలు చోటుండదు. ఆ రోజు ఎప్పుడోస్తుందో?

  16. రిజర్వేషన్లు అమలు పరచేవారు, రిజర్వేషన్లు అందుకోనేవారు నిబద్దత పాటిస్తే ఎటువంటి వాదవివాదాలు చోటుండదు. ఆ రోజు ఎప్పుడోస్తుందో?

  17. ప్రవీణ్ గారూ
    రిజర్వేషన్ల అసలు ఉద్దేశం మరుగున పడిపోయి కులాహంకారాలు తన్నుకొచ్చాయి. పాత కథలు తవ్వడం కూడా ఎక్కువైంది.మీ ప్రతిపాదన మంచిదే. హేతుబద్ధమైనది.కాని ఈ దేశపు కులాహంకారాల హోరులో ఎవరూ వినిపించుకునే పరిస్థితి లేదు.ఇక్కడ ప్రతివాడూ ఒక మాస్ వోట్‌బ్యాంకుగా మారితేనే రాజకీయ పార్టీలు వాళ్ళ గోడు వినిపించుకుంటాయి.లేకపోతే లేదు.అగ్రకులాలు సరిగా వోటింగ్‌లో పాల్గొనరు.అలాగని వాళ్ళ వోట్లు కొనడం కూడా కష్టమే.అందుకని వాళ్ళ వాదన ఇక్కడ ఎవరూ వినట్లేదు. మేధో చర్చలకి పరిమితం కాకుండా ముందు మీరు వోట్‌బ్యాంకుగా మారండి.అప్పుడు చూస్కోండి మీ తడాఖా !

  18. ప్రవీణ్ గారూరిజర్వేషన్ల అసలు ఉద్దేశం మరుగున పడిపోయి కులాహంకారాలు తన్నుకొచ్చాయి. పాత కథలు తవ్వడం కూడా ఎక్కువైంది.మీ ప్రతిపాదన మంచిదే. హేతుబద్ధమైనది.కాని ఈ దేశపు కులాహంకారాల హోరులో ఎవరూ వినిపించుకునే పరిస్థితి లేదు.ఇక్కడ ప్రతివాడూ ఒక మాస్ వోట్‌బ్యాంకుగా మారితేనే రాజకీయ పార్టీలు వాళ్ళ గోడు వినిపించుకుంటాయి.లేకపోతే లేదు.అగ్రకులాలు సరిగా వోటింగ్‌లో పాల్గొనరు.అలాగని వాళ్ళ వోట్లు కొనడం కూడా కష్టమే.అందుకని వాళ్ళ వాదన ఇక్కడ ఎవరూ వినట్లేదు. మేధో చర్చలకి పరిమితం కాకుండా ముందు మీరు వోట్‌బ్యాంకుగా మారండి.అప్పుడు చూస్కోండి మీ తడాఖా !

  19. నేను తాడేపల్లి గారితో ఏకీభవిస్తున్నా…ఇప్పటికే రిజర్వేషన్లు సమానత అంశం నుంచి రాజకీయ అంశంగా మార్పు చెందిపోయాయి. (కుల పరంగా) దానికి నిదర్శనమే ఈ “దండోరా”లు డప్పులూను. ఆఖరికి జనాభాలో అయిదు శాతం కన్నా తక్కువున్న కొన్ని కులాలు కూడా ఇప్పుడు జయభేరీలు, రణభేరీలు పెట్టి సీ ఎమ్ స్థాయి నాయకులను పిలుస్తున్నాయి..వారూ చచ్చినట్ల వెల్తున్నారు. వోటు బ్లాక్ మెయిలింగు అది. దాన్ని ఎప్పుడో తాతాల, ముత్తాతల కాలంలో అందరు అంటగట్టేసిన “అగ్ర” భారాన్ని మోస్తున్నవారు ఎలాగూ ఎదుర్కోలేరు (ఒక రెండు, మూడు నిజమైన అగ్ర కులాలు తప్ప), రోడ్ల మీద పడి అలాంటి సభలూ పెట్టలేరు.వాల్ల పూర్వ తరాలు నేర్పిన పనికిరానితనం అది. మా తాతలు నేతులు తాగారు సరే ప్రభువా, నేనిప్పుడు గోతులు తవ్వుకుని బతుకుతున్నాను, ఆర్ధిక సాయం చెయ్యండి అని అడుక్కోనూలేరు.

    ఎప్పుడైతే ఈ కుల గజ్జి రిజర్వేషన్లు పోయి , ఆర్ధిక పరంగా రిజర్వేషన్లు వస్తాయో అప్పుడే పేదవాడు నిజంగా రాజవుతాడు.

  20. నేను తాడేపల్లి గారితో ఏకీభవిస్తున్నా…ఇప్పటికే రిజర్వేషన్లు సమానత అంశం నుంచి రాజకీయ అంశంగా మార్పు చెందిపోయాయి. (కుల పరంగా) దానికి నిదర్శనమే ఈ “దండోరా”లు డప్పులూను. ఆఖరికి జనాభాలో అయిదు శాతం కన్నా తక్కువున్న కొన్ని కులాలు కూడా ఇప్పుడు జయభేరీలు, రణభేరీలు పెట్టి సీ ఎమ్ స్థాయి నాయకులను పిలుస్తున్నాయి..వారూ చచ్చినట్ల వెల్తున్నారు. వోటు బ్లాక్ మెయిలింగు అది. దాన్ని ఎప్పుడో తాతాల, ముత్తాతల కాలంలో అందరు అంటగట్టేసిన “అగ్ర” భారాన్ని మోస్తున్నవారు ఎలాగూ ఎదుర్కోలేరు (ఒక రెండు, మూడు నిజమైన అగ్ర కులాలు తప్ప), రోడ్ల మీద పడి అలాంటి సభలూ పెట్టలేరు.వాల్ల పూర్వ తరాలు నేర్పిన పనికిరానితనం అది. మా తాతలు నేతులు తాగారు సరే ప్రభువా, నేనిప్పుడు గోతులు తవ్వుకుని బతుకుతున్నాను, ఆర్ధిక సాయం చెయ్యండి అని అడుక్కోనూలేరు. ఎప్పుడైతే ఈ కుల గజ్జి రిజర్వేషన్లు పోయి , ఆర్ధిక పరంగా రిజర్వేషన్లు వస్తాయో అప్పుడే పేదవాడు నిజంగా రాజవుతాడు.

  21. మీ అభిప్రాయాలు తెలిపినందుకు కృతజ్ఞతలు చరసాల, నవీన్, బాలసుబ్రమణ్యం, చేతన, valluri, సుధాకర్ అందరికీ . మీలో చాలా మంది అభిప్రాయాలు నాకు ఎంతగానో నచ్చాయి.

    ఎన్ని మంచి ఆలోచనలు ఉన్నా ఏమి లాభం execution part కి వచ్చేసరికి ఇది డీలా పడాల్సిందే. ఈ రాజకీయ నాయకులు దీనిని మార్చేదీ దగ్గర్లో కనపడతం లేదు. దేశానికి ఒక మార్గా నిర్దేశం చెయ్యాల్సిన వారిలో మార్పు వచ్చి radical decisions తీసుకుంటే తప్ప జరగని పని.

    అర్జున్ సింగ్ లాంటి వెధవ రాజకీయ నాయకులు ఈ రిజర్వేషనలను తమ పర్సనల్ అజెండాల కోసం వాడుకుంటున్నంత వరకూ ఇందులో మార్పు రాదు.

    బాలసుబ్రమణ్యం గారు అన్నట్టు వోటు వెయ్యని నాకు మాట్లాడే హక్కు లేదు. కానీ ఏం చెయ్యను. ఓ దగ్గర ఉంటేగా ఓటు తెచ్చుకోడానికి. మొన్నే ఒక ఏడాదిన్నర క్రితం ఇక్కడ కర్ణాటక లో ఓటు హక్కు తెచ్చుకున్నాను. ఈ సారి వోటు వేస్తాను. కానీ రిజర్వేషన్ల గురించి ఎవరి మేనిఫెస్టో లోనూ ఉండదని నేను ఇప్పుడే ఘంటాపథంగా చెబుతున్నాను. ఎందుకంటే వోటు బాంకు ఆయన అన్నట్టు అగ్ర కులాలవారు కాదు. నా వోటు మాత్రం వేస్తాను ఈసారి.

    డిస్కషను కొనసాగించను అని మళ్ళీ రాస్తున్నందుకు క్షమించాలి.

  22. మీ అభిప్రాయాలు తెలిపినందుకు కృతజ్ఞతలు చరసాల, నవీన్, బాలసుబ్రమణ్యం, చేతన, valluri, సుధాకర్ అందరికీ . మీలో చాలా మంది అభిప్రాయాలు నాకు ఎంతగానో నచ్చాయి.ఎన్ని మంచి ఆలోచనలు ఉన్నా ఏమి లాభం execution part కి వచ్చేసరికి ఇది డీలా పడాల్సిందే. ఈ రాజకీయ నాయకులు దీనిని మార్చేదీ దగ్గర్లో కనపడతం లేదు. దేశానికి ఒక మార్గా నిర్దేశం చెయ్యాల్సిన వారిలో మార్పు వచ్చి radical decisions తీసుకుంటే తప్ప జరగని పని.అర్జున్ సింగ్ లాంటి వెధవ రాజకీయ నాయకులు ఈ రిజర్వేషనలను తమ పర్సనల్ అజెండాల కోసం వాడుకుంటున్నంత వరకూ ఇందులో మార్పు రాదు.బాలసుబ్రమణ్యం గారు అన్నట్టు వోటు వెయ్యని నాకు మాట్లాడే హక్కు లేదు. కానీ ఏం చెయ్యను. ఓ దగ్గర ఉంటేగా ఓటు తెచ్చుకోడానికి. మొన్నే ఒక ఏడాదిన్నర క్రితం ఇక్కడ కర్ణాటక లో ఓటు హక్కు తెచ్చుకున్నాను. ఈ సారి వోటు వేస్తాను. కానీ రిజర్వేషన్ల గురించి ఎవరి మేనిఫెస్టో లోనూ ఉండదని నేను ఇప్పుడే ఘంటాపథంగా చెబుతున్నాను. ఎందుకంటే వోటు బాంకు ఆయన అన్నట్టు అగ్ర కులాలవారు కాదు. నా వోటు మాత్రం వేస్తాను ఈసారి.డిస్కషను కొనసాగించను అని మళ్ళీ రాస్తున్నందుకు క్షమించాలి.

Leave a reply to తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం స్పందనను రద్దుచేయి