మైక్రోబ్లాగింగు… – కుచించుకుపోతున్న సమాచారం

అసలు మన సంభాషణలు రానురానూ ఎంత కుచించుకుపోతున్నాయో అనిపిస్తుంది నాకు…

ముఖాముఖి మాట్లాడుకునే రోజులనుండి మెల్లగా ఉత్తరాలు, ఫోనులు, ఈమెయిళ్ళూ, ఎసెమెస్సులు.
ఈ ట్రెండుని చూస్తే మీకనిపించట్లేదూ రాను రానూ మాటలు తక్కువయిపోతున్నట్టు.

అన్నట్టు ఈ పద్ధతి కేవలం మన మాటలకే కాదు, అన్ని రకాల సాధనాలకీ వర్తించడం మొదలయింది.
భాష కూడా స్పష్టంగా చెప్పగలిగే పదాల నుంచి పొడి పొడి మాటల వైపు సాగుతుంది అనిపిస్తుంది.

ఉదా: “Can I see you tomorrow ?” ఈ వాక్యం రాయాలనుకోండి ఇప్పట్లో అయితే జనాలు ఇలా రాస్తున్నారు “cn i c u tmrw ?”

అసలు మరీ ఇంత పొదుపేంటో ??
కొన్ని సార్లయితే నాకు తెలిసిన డీక్రిప్షన్ టెక్నిక్కులు కూడా ఉపయోగించి మరీ చదువుకోవాల్సి ఉంటుంది.
(ఇంకొన్ని సార్లు గూగుల్ లో వెతకాల్సి ఉంటుంది)

ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే బ్లాగులు రాయడం నుంచి ప్రపంచం ఇప్పుడు “మైక్రోబ్లాగింగ్” వైపు సాగుతుంది. (కవితల నుండి హైకూల వైపు సాగినట్టు).

మన తెలుగు లోకంలో బ్లాగులంటే కొత్త మోజులో బాగున్నాయి గానీ ఆంగ్లంలో బ్లాగులు ఇప్పటికే “ఫాటిగ్” వైపు సాగుతున్నాయి. ఇప్పటి వరకూ (ఇంకా రాస్తున్నారు అనుకోండి) ఎంతో ఓపికతో రాసిన వారు ఇప్పుడు ఓపిక లేక కొత్త ట్రెండుని మొదలుపెట్టారు. అదే మైక్రోబ్లాగింగ్.

ఇందులో ప్రత్యేకత ఏమిటంటారా ? లైన్ల కొద్దీ, పేజీల కొద్దీ రాయక్కర్లేకుండా కేవలం కొద్ది మాత్రం పదాలతోనే మనం చెప్పాలనుకున్నది చెప్పడం అన్నమాట.

ఈ పద్ధతిని బాగా ప్రాచుర్యం లోకి తెచ్చింది ట్విట్టర్. దీని గురించి ఒక మైక్రో బ్లాగు లాగా ఊహించుకోండి. కాకపోతే ఇందులో మీరు నూట నలభై పదాలకన్నా ఎక్కువ రాయలేరు. అంటే మీరనుకున్నదాన్ని సరిగా చెప్పడానికి క్రియేటివిటీ ఉపయోగించాలన్నమాట.

ఈ అప్లికేషను రాత్రికి రాత్రే పెద్ద హిట్టయిపోయింది. జనాలు విపరీతంగా ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇందులో నిమిష నిమిషానికీ ఏం చేస్తున్నారో రాసేసే వాళ్ళూ ఉన్నారు, తమకు తెలిసిన లంకెలను ఇతరులతో పంచుకునే వాళ్ళూ ఉన్నారు, తమ ఉత్పత్తులకి ప్రచారం చేసుకునే వాళ్ళున్నారు, తమ బ్లాగు టపాలకి ఇందులో లంకెలిచ్చి హిట్లు పెంచుకునే ప్రబుద్దులూ ఉన్నారు.

వైవిధ్య భరితమయిన అవసరాలకు ఇప్పుడు దీనిని జనాలు వాడడం జరుగుతుంది. ప్రెసిడెన్షియల్ కాంపెయిన్ కి ఆఖరికి ఒబామా, హిల్లరీలు కూడా దీనిని వాడారు.

అలాగే ఎన్నో కంపెనీలు తమ ఉత్పత్తుల విడుదలలు, వాటి మీద తగ్గింపులు గట్రా ట్విట్టర్ ద్వారా ప్రచారం చేసుకుంటున్నాయి. ఉదా: డెల్ అవుట్‌లెట్.

ఇక ట్విట్టర్ బాగా ప్రాచుర్యం పొందడంతో దానికి ప్రత్యామ్నాయంగా ఇంకొన్ని సర్వీసులూ మొదలయ్యాయి.

జైకూ (దీనిని ఇప్పుడు గూగుల్ అక్వైర్ చేసింది)

టంబ్లర్ (ఇది ఇంకో రకమయిన మైక్రోబ్లాగింగ్ లంకెలు, ఫోటోలూ, చిన్న చిన్న మెసేజీలు అంటే మల్టీమీడియాతో సహా అన్నమాట.), పౌన్స్ మొదలయినవి… దాదాపు ఇలాంటి వంద సైట్లు ఇప్పటి వరకూ మొదలయ్యాయని ఒక అంచనా.

అసలు ఇవి ఎంతగా ప్రాచుర్యం పొందాయి అంటే వీటి కోసం, వీటి మీద ఆధారపడి ఇంకొన్ని స్టార్టప్పులే తయారయ్యాయి.

ఉదా: ట్విట్టర్‌లో ట్వీట్ లను వెతకడం కోసం సమ్మైజ్ అనే ఒక స్టార్టప్ మొదలయింది (ఇప్పుడు ట్విట్టర్ దీనిని కొనేసిందనుకోండి). అలాగే దీంట్లో రాయడం కోసం ప్రత్యేకంగా ఎన్నో క్లైంటులను తయారు చేసారు. మంటనక్క జోడింపుగా, అడోబ్ ఎయిర్ ఆప్ గా, కేడీయీ విడ్జెట్టుగా, చెప్పలేనన్ని క్లయింటులు దీని కోసం రాయబడ్డాయి.

ఈ ధాటిని తట్టుకోలేక ట్విట్టర్ ఇప్పుడు స్కేలబులిటీ సమస్యలని కూడా ఎదురుకుంటోంది.

ఈ కాన్సెప్టు ఇంతగా హిట్టయితే ఇక దీనిని వేరే వాటికి ఆపాదించకుండా ఉంటారా ? వెంటనే ఇలాంటివే అప్లికేషన్లు తెగ మొదలయినియ్యి.

ఈ మధ్యే 12seconds.tv అనే కొత్త సైటు ప్రారంభమయింది. ఇది కూడా ట్విట్టర్ లానే కానీ వీడియో కోసం. పన్నెండు సెకెండ్లలో మీరు రికార్డు చెయ్యాలనుకున్నది చేసెయ్యాలి. (ఇంతకు ముందే ఫ్లికర్ లో కూడా తొంభై సెకండ్లు మాత్రమే కనిపించగలిగే వీడియో మొదలుపెట్టారు)

అలాగే ఇదే కాన్సెప్టు మీద ఫ్రెండ్‌ఫీడ్ అనే సైటు కూడా మొదలయింది. ఇది మీ పర్సనల్ అగ్రిగేటర్ అన్నమాట. మీ అన్ని అకౌంట్లలో నుంచీ మీరు ఎప్పుడే తాజీకరణ చేసినా వెంటనే ఇది పట్టేస్తుంది. అన్నిటినీ ఒక దగ్గర చూపిస్తుంది. గూగుల్ లో ఇంతకు ముందు పని చేసే వాళ్ళచే మొదలుపెట్టబడిన కంపెనీ ఇది. ఈ మధ్య కాలంలో బాగా పేరు పొందుతూంది.

ఇవన్నీ కొద్దిగా ఎగస్ట్రాగా అనిపించడం లేదూ… ఎగస్ట్రానే… ఏం చేస్తాం. పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నారు మరి. ఈ బుడగా ఎప్పుడో‌ పేలుతుంది.

20 thoughts on “మైక్రోబ్లాగింగు… – కుచించుకుపోతున్న సమాచారం

  1. నేను మొన్నే దీన్ని గురించి తెలుసుకున్నా మరో ప్రముఖ బ్లాగరు నించి. ఇంకాస్త పరిశోధన చెయ్యాలి అనుకుంటూ ఉండగా, చక్కగా సంక్షిప్త వివరాలు ఇక్కడ పెట్టారు.
    అందుకోండి నా అభినందనలు.

  2. నేను మొన్నే దీన్ని గురించి తెలుసుకున్నా మరో ప్రముఖ బ్లాగరు నించి. ఇంకాస్త పరిశోధన చెయ్యాలి అనుకుంటూ ఉండగా, చక్కగా సంక్షిప్త వివరాలు ఇక్కడ పెట్టారు.అందుకోండి నా అభినందనలు.

  3. చక్కని సమాచారం సాధ్యమైనంత వివరంగా అందించారు … ధన్యవాదాభినందనలు … నేను దీని మీద టపా వ్రాయటం ఆలస్యం చేయటం మంచిదే అయ్యిది 😉 …

    ఈ బుడగ ఇప్పుడే పేలకపోవచ్చు .. కానీ ఇది అంటే మొహం మొత్తిన వాళ్లో లేక/మరియు ఎప్పుడూ కొత్తదనం కోసం చూసే వాళ్ల వలన గానీ ఇప్పుడే కొత్తగా Live Blogging అని మొదలు పెట్టారు. మీకు తెలిసే ఉంటుంది. వీలైతే దాని గురించి కూడా వ్రాయటానికి ప్రయత్నించండి.

    అలాగే ఇండియాలో ఉన్న వాటిని(SMSGupShup, Vakow etc) కూడా cover చేస్తే బాగుండేది ..

    This microblogging here is USA especially in Silicon Valley beating the hell out of the traditional and main stream media like CNN, Fox, ABC etc with instant updates about any that’s happening in and around.

    ఇలా మన ఇండియాలో కూడా వస్తే అలాగే దీనిని రేపు రాబోయే IPTV Services తో జత చేస్తే , వార్తలంటే వాళ్లు ప్రసారం చేసేవి మాత్రమే అనుకునే మీడియా మెడలు వంచటానికి ఒక గొప్ప అవకాశం వచ్చినట్టే అని నా అభిప్రాయం ..

  4. చక్కని సమాచారం సాధ్యమైనంత వివరంగా అందించారు … ధన్యవాదాభినందనలు … నేను దీని మీద టపా వ్రాయటం ఆలస్యం చేయటం మంచిదే అయ్యిది 😉 … ఈ బుడగ ఇప్పుడే పేలకపోవచ్చు .. కానీ ఇది అంటే మొహం మొత్తిన వాళ్లో లేక/మరియు ఎప్పుడూ కొత్తదనం కోసం చూసే వాళ్ల వలన గానీ ఇప్పుడే కొత్తగా Live Blogging అని మొదలు పెట్టారు. మీకు తెలిసే ఉంటుంది. వీలైతే దాని గురించి కూడా వ్రాయటానికి ప్రయత్నించండి.అలాగే ఇండియాలో ఉన్న వాటిని(SMSGupShup, Vakow etc) కూడా cover చేస్తే బాగుండేది ..This microblogging here is USA especially in Silicon Valley beating the hell out of the traditional and main stream media like CNN, Fox, ABC etc with instant updates about any that’s happening in and around. ఇలా మన ఇండియాలో కూడా వస్తే అలాగే దీనిని రేపు రాబోయే IPTV Services తో జత చేస్తే , వార్తలంటే వాళ్లు ప్రసారం చేసేవి మాత్రమే అనుకునే మీడియా మెడలు వంచటానికి ఒక గొప్ప అవకాశం వచ్చినట్టే అని నా అభిప్రాయం ..

  5. మైక్రోబ్లాగింగు చెయ్యడం కంటే అసలు బ్లాగింగే చెయ్యకపోవడం లోకకల్యాణం అనిపించుకుంటుంది. ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కానివాళ్ళున్న ప్రపంచంలో ఇటువంటి సూపర్ క్లుప్తత ఒక అవలక్షణం.

    ఏదేమైనా, మీ కభ్యంతరం లేకపోతే మీరిచ్చిన సమాచారాన్ని (మీ పేరు చెప్పి) ఒక పుస్తకంలో వాడుకోవాలనుకుంటున్నాను. మీ అభిప్రాయం తెలియజెయ్యగలరని ప్రార్థన.

  6. మైక్రోబ్లాగింగు చెయ్యడం కంటే అసలు బ్లాగింగే చెయ్యకపోవడం లోకకల్యాణం అనిపించుకుంటుంది. ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కానివాళ్ళున్న ప్రపంచంలో ఇటువంటి సూపర్ క్లుప్తత ఒక అవలక్షణం.ఏదేమైనా, మీ కభ్యంతరం లేకపోతే మీరిచ్చిన సమాచారాన్ని (మీ పేరు చెప్పి) ఒక పుస్తకంలో వాడుకోవాలనుకుంటున్నాను. మీ అభిప్రాయం తెలియజెయ్యగలరని ప్రార్థన.

  7. Oh! You remind me of a incident of a Holy Cow’s slaughter in Enlgad. Pl dont mind. But it was horrible blogging there. It was abt a Hindu Temple in an English Country, which had this Holy, Sacred cow, affected by some disease. The authorities wanted to kill the animal in order not to spread the disease in the live stock around the area. The British Hindus demonstrated, media was out there and these bloggers had blogged abt minute to minute devolopments of the slaughter, I felt so awkward, (also religiously upset), funny and shocked to know how blogging has intruded in our lives. It was bad. It was news. But it was Blogging!

    These blogs were followed very madly. (for breaking news / latest developments etc.) The cow was killed by RSPCA finally. I think they were these kind of blogs.

    Thanks for the info. (honestly)

  8. Oh! You remind me of a incident of a Holy Cow’s slaughter in Enlgad. Pl dont mind. But it was horrible blogging there. It was abt a Hindu Temple in an English Country, which had this Holy, Sacred cow, affected by some disease. The authorities wanted to kill the animal in order not to spread the disease in the live stock around the area. The British Hindus demonstrated, media was out there and these bloggers had blogged abt minute to minute devolopments of the slaughter, I felt so awkward, (also religiously upset), funny and shocked to know how blogging has intruded in our lives. It was bad. It was news. But it was Blogging! These blogs were followed very madly. (for breaking news / latest developments etc.) The cow was killed by RSPCA finally. I think they were these kind of blogs. Thanks for the info. (honestly)

  9. సరికొత్త సమాచారం. దీనిని తెలుగు బ్లాగులకు అన్వయం చెయ్యవచ్చేమో? ఇన్ని బ్లాగులు చదవటం కష్టం గా ఉందని, పాఠకులు ఫిర్యాదు చేస్తున్నారు.

  10. సరికొత్త సమాచారం. దీనిని తెలుగు బ్లాగులకు అన్వయం చెయ్యవచ్చేమో? ఇన్ని బ్లాగులు చదవటం కష్టం గా ఉందని, పాఠకులు ఫిర్యాదు చేస్తున్నారు.

  11. @ తెలుగువాడిని గారు:
    నిజమే… ప్రముఖ టెకీ బ్లాగర్లు (టెక్‌క్రంచ్ వగయిరా) సయితం తమ వార్తల కోసం ట్విట్టర్ లాంటి వాటి మీద ఆధారపడుతున్నారంటేనే తెలుస్తుంది దీని మహత్యం.

    భారతంలోని స్టార్టప్పులు, మొబైల్ సహాయంతో చేసే మైక్రోబ్లాగింగూ, లైవ్ బ్లాగింగూ కవరు చేస్తే బానే ఉండును… (మీ టపా ఎలాగూ రెడీ అవుతుంది గనక అందులో రాయగలరు 😉

    వీటి సహాయంతో నిజంగానే సిటిజన్ జర్నలిజం లాంటివి ఊపందుకునేలా, మీడియా కాకుండా వ్యక్తులు వార్తలందించేలా చేయవచ్చు…

    @ తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు:

    అన్ని సందర్భాలలోనూ ఈ మైక్రోబ్లాగింగు పనికిరాకపోయినా వీటికుండే అవసరాలు వీటికీ ఉన్నాయి.

    ఈ టపాలోని సమాచారాన్ని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.

    @ sujata గారు:
    వెర్రి వెయ్యి విధాలని ఊరికే అనలేదు…

    మీరు చెప్పిందీ ఒకరకంగా నిజమే. అయినదాన్ని కానిదాన్నీ కూడా బ్లాగింగు చేసే వారు మొదలయ్యారు ఇప్పుడు.

    తమ జీవితంలోని నిత్యకృత్యాలనీ లైవ్ గా స్ట్రీమింగూ, బ్లాగింగూ చేసేవారున్నారు.

    @ cbrao గారు:
    భాష ఇక్కడ అడ్డు కానే కాదు! మనం యూనీకోడులోనే మైక్రోబ్లాగింగు చెయ్యవచ్చు.

    మనం రాసే టపాల నిడివికి లంకెలిచ్చుకోడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుందేమో 🙂

  12. @ తెలుగువాడిని గారు:నిజమే… ప్రముఖ టెకీ బ్లాగర్లు (టెక్‌క్రంచ్ వగయిరా) సయితం తమ వార్తల కోసం ట్విట్టర్ లాంటి వాటి మీద ఆధారపడుతున్నారంటేనే తెలుస్తుంది దీని మహత్యం.భారతంలోని స్టార్టప్పులు, మొబైల్ సహాయంతో చేసే మైక్రోబ్లాగింగూ, లైవ్ బ్లాగింగూ కవరు చేస్తే బానే ఉండును… (మీ టపా ఎలాగూ రెడీ అవుతుంది గనక అందులో రాయగలరు ;-)వీటి సహాయంతో నిజంగానే సిటిజన్ జర్నలిజం లాంటివి ఊపందుకునేలా, మీడియా కాకుండా వ్యక్తులు వార్తలందించేలా చేయవచ్చు… @ తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు:అన్ని సందర్భాలలోనూ ఈ మైక్రోబ్లాగింగు పనికిరాకపోయినా వీటికుండే అవసరాలు వీటికీ ఉన్నాయి.ఈ టపాలోని సమాచారాన్ని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.@ sujata గారు:వెర్రి వెయ్యి విధాలని ఊరికే అనలేదు…మీరు చెప్పిందీ ఒకరకంగా నిజమే. అయినదాన్ని కానిదాన్నీ కూడా బ్లాగింగు చేసే వారు మొదలయ్యారు ఇప్పుడు.తమ జీవితంలోని నిత్యకృత్యాలనీ లైవ్ గా స్ట్రీమింగూ, బ్లాగింగూ చేసేవారున్నారు.@ cbrao గారు:భాష ఇక్కడ అడ్డు కానే కాదు! మనం యూనీకోడులోనే మైక్రోబ్లాగింగు చెయ్యవచ్చు.మనం రాసే టపాల నిడివికి లంకెలిచ్చుకోడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుందేమో 🙂

  13. టెక్నాలజీ సంగతి పక్కన పెడితే, అసలు మనకి ఇన్ని సమాచార సాధనాలు అవసరమా అని.? అసలేముంటాయి అన్ని సమాచారాలు చేరవేసుకోడానికి? నిముషానికి మనం ఎం చేస్తున్నామో పక్కవారికి తెలియాలా? అసలేం పొడిచేస్తూ ఉంటామని? అసలంత టైమ్ ఎక్కణ్ణుంచి వస్తుంది వీళ్ళకి? అసలు డైరీ లా రాసుకోవడానికి మొదలయిన బ్లాగింగ్ అన్న కాన్సెప్ట్ ఇప్పుడు వెర్రి తలలు వేస్తూ విష వృక్షం లా వేళ్ళూనుకొని పోయింది. ఇక బ్లాగర్ల మధ్య ప్రచ్చన్నయుద్ధాలకయితే అంతేలేదు….చదువు, హోదా ల సంగతి మరచిపోయి యుద్ధాలకి దిగుతున్నారు… నేడు పెరుగుతున్న నేరాలలో మొబైల్స్ , వందల కొద్దీ టి.వి చానల్స్, ఉన్నవే చాలకుండా ఇప్పుడు ఇలాంటి సోష్యల్ నెట్వర్క్ లుకూడా , తమవంతుసాయం చేస్తున్నాయి. ఇదంతా టెక్నాలజీ అనుకొని మురిసిపొమ్మంటే మాత్రం …….

Leave a reply to రవి స్పందనను రద్దుచేయి