23 thoughts on “మా ఊరి గాలి …

  1. నిజంగా మన ఊరు వెళ్తున్నామంటే అదీ చాలా కాలం తర్వాత అంటే ఆ ఉద్వేగాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవేమో! మీ టపా బావుంది.. కాస్త గ్యాప్ తీసుకున్నా చక్కగా అందరినీ చూసొచ్చారు.. కానీ కెమెరా లేకుండా వెళ్ళడం నాకేమాత్రం నచ్చలా 🙂

  2. పోస్టు సూపరు. బ్రిడ్జు పైనుండీ గోదారి. అబ్బ.నాకు భలే కుళ్ళు, కోస్తా వాళ్ళ మీద. మాది రాయలసీమ కాబట్టి.మొత్తానికి నెల్లూర్, ఏలూర్, నిడదవోలు, రాజమండ్రి,వరంగల్లు, హైదరాబాద్…ఏ సెంటరయినా సై సవాల్ అని యువవజ్ర గోలకృష్ణ లా మీరూ గర్జించచ్చు.:-)

  3. ఒక్క సారి పాత ఙ్ఞాపకాలని తట్టిలేపారు. నా పన్నెండో తరగతి అయిపోయి ఇంటికి వెళ్తూ, చాలా ఏళ్ల తరువాత మా ఊరు (అమ్మ పుట్టిల్లు) తణుక్కి వెళ్లాను. అప్పటికి మా తాతగారొక్కరే ఉంటున్నారు, ఒంటరిగా. విశాఖ ఎక్సుప్రెస్సులో బండి దిగగానే, రిక్షాఅబ్బి అడిగిన ఆరు రూపాయలు… ఈ గాలి, ఈ ఊరు అనుకుంటూ నేను అస్సలు బేరమాడకుండా ఎక్కేయడం…. ఇంటికి చేరంగానే, వెధవ, రిక్షావాడికి అంతెందుకిచ్చావురా అని మా తాతగారు తిట్టడం….. అన్నీ ఒక్కసారి మదిలో మెదిలాయి.అస్సలు రైల్లో తణుకొస్తోందనగానే కనిపించే ఆ పచ్చదనం, ఆ కొబ్బరి చెట్లు, చెరువులు, కాలవలు …. ఈ గాలి , ఈ ఊరు అని ఏదో ఇదై చెప్పేస్తుంటాను. అయినా నీకు అర్థరాత్రి విశాఖ ఎక్సెప్రెస్సులో బయట చీకటిలో అస్సలు ఏ కొబ్బరిచెట్లు, చెరువులు కనిపించాయిరా అని మా పెద్దనాన్న ఇప్పటికీ గేలి చేస్తుంటారు కూడా 🙂

  4. మన ఊరికి వెళ్ళడం అనేది మంచి అనుభూతి.మన శరీరం ఊరికి అధోగమనంలో వెళ్తూ ఉంటే మన మనస్సు మాత్రం పురోగమనంలో జ్ఞాపకాల వైపుకి వెళ్తూ ఉంటుంది.నాకూ మా ఊరికి వెళ్ళిన అనుభూతి కలిగించింది మీ టపా.

  5. @ మధు:వీలు చూసుకుని వెళ్ళి రండి మరి.@ వేణూ శ్రీకాంత్:మనల్ని మనమే మర్చిపోయేంత వేగంగా ఉన్నాయి మార్పులు :(@ రానారె:అన్నీ ఊళ్ళూ నావేనయ్యా రామనాథా. అన్నిచోట్లా బంధువులున్నారు. అయితే అమ్మమ్మ వాళ్ళ ఊరు నిడదవోలు.@ ప్రపుల్ల:చాలా బాధగా అనిపించింది నాకు కూడా. అలాంటి కొన్ని తప్పులు అనుకోకుండా జరిగిపోతాయంతే.@ సుజాత గారు:అన్ని ఊళ్ళకీ వెళ్ళానండీ. @ లలిత గారు:అది కుదిరితే ఎంత బాగుణ్ణో. ప్చ్… సమయం, సందర్భం రెండూ కుదరలేదు.@ దేవన:మీరూ ట్రిప్పేస్తున్నారా ఏమిటి ? :)@ చైతన్య:మళ్ళీ మళ్ళీ వేసుకోవాలనిపించేటి సాంగు. ఏం చేద్దాం.@ నిషిగంధ గారు:నన్ను నేనే తిట్టుకోవాలి తీసుకువెళ్ళనందుకు.@ ఏకాంతపు దిలీపు:నిడదవోలేనండీ, అదే అమ్మమ్మ ఊరు.@ రవి:మరే ఈ సారి మీరు మా ఊరికీ, నేను మీ ఊరికీ వెళదాము. లెక్క సరిపోద్ది.@ శ్రీ హర్ష:హహహ! మనకు ఆ అందాలు చీకట్లో కూడా కనిపిస్తాయి మరి.@ శ్రీ:దూరాలు మనుషులకే, ఆలోచలనకు కావు. కానీ కుదిరినప్పుడు ఆ మనుషుల దూరాలూ దగ్గర చేయాలి.@కొత్తపాళీ, నేస్తం, మహేష్, పరిమళం:కృతజ్ఞతలు.

  6. కామెంటు పెట్టకూడదు అనుకుని ఇన్నాళ్ళూ ఊరుకున్నాను ఎందుకంటే నేను దీని గురించి రాయడం మొదలు పెడితే ఆగను కాబట్టి. కానీ ఇంక ఆగలేక పెడుతున్నాను 🙂 అబ్బా…ఎన్ని జ్ఞాపకాలు కదిలించారో.[కదిలిన జ్ఞాపకాలన్నీ రాయనులెండి.భయపడకండి.అవన్నీ రాయకుండా వుండడం గురించే ఇన్నాళ్ళూ ఆగింది 🙂

  7. మీరు వ్రాసినది చాలా బాగుంది.అందుకనే రిటైర్ అయిన తరువాత రాజమండ్రీ లో గోదావరి గట్టున ఒక అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని ఇక్కడ అందాలు అనుభవిస్తున్నాను.నా భార్య సహకారం కూడా ఉంది.కాలూ,చెయ్యి ఆడుతున్నంత కాలం ఇక్కడ ఉందామని ఉంది.ఆ పైన భగవంతుని దయ .

Leave a reply to ప్రపుల్ల చంద్ర స్పందనను రద్దుచేయి