విండోసు లాపుటాపు పై లినక్సు… నా తంటాలు…

ఈ రోజు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను.

ఎట్టకేలకు నా లాపుటాపు ని కూడా కుబుంటు తో లోడు చేసాను. దానికి ఇన్నాళ్ళు తీసుకోవడానికి చాలా కారణాలున్నాయి.
మొదటిది మా కంపెనీ వారు లాపుటాపుల మీద లినక్సు ని సపోర్టు చెయ్యరు. వారు చెయ్యకపోయినా ఫరవాలేదు కానీ కొన్ని అప్లికేషన్ల కోసం విండోస్ కావాల్సిందే. ఎలాంటివంటే “ఐపీ కమ్యూనికేటరు” వంటివి. కాబట్టి రెండూ ఉండేలా “డ్యూవల్ బూట్” చెయ్యాలి.

ఈ క్రమంలో నే పడ్డ బాధలు అన్నీ ఇన్నీ కావు. ఎట్టకేలకు సాధ్యమయింది.

ఇది సాధించడానికి నే చేసినవి ఈ క్రమంలో:

నా లాపుటాపు లో ఒకే పార్టీషనుంది. లినక్సు ఇన్స్టాలు చెయ్యాలంటే ఇంకో పార్టీషను కావాలి. కానీ ఫార్మాట్ చేస్తే ఇంతవరకూ విండోస్ లో ఉన్న డాటా, ఇన్స్టాలు చేసిన అప్లికేషన్లూ పోతాయి. అందుకని రీపార్టీషన్ చెయ్యాలి. కానీ డాటా లాస్ కాకుండా. FAT, FAT32 వంటి ఫైల్ సిస్టంలైతే పెద్ద కష్టం కాదు కానీ NTFS కి సపోర్టు తక్కువే.
మొదట కుబుంటు “లైవ్ సీడీ” లో ఉన్న QTParted టూల్ ని ఉపయోగించి రీసైజు చెయ్యడానికి ప్రయత్నించాను. కానీ ఫెయిలయింది. ఎందుకంటే డిస్కు ని నేను దాదాపు ఎన్నో నెలలుగా “డీఫ్రాగ్” చెయ్యలేదు.

* మన హార్డు డిస్కు ఉపయోగించిన కొద్దీ అందులో స్టోర్ చేసే ఫైళ్ళు చెల్లా చెదురుగా పడుంటాయి. ఎందుకంటే కొన్నాళ్ళుగా మనం ఇన్స్టాలు, అనిన్స్టాలు, క్రియేటు, డిలీటు వంటివి మన ఫైళ్ళతో చేస్తుంటాము. కాబట్టి ఫైళ్ళన్నీ హార్డు డికులో అక్కడా ఇక్కడా ఉంటాయి. దానినే ఫ్రాగ్మెంటేషన్ అంటారు. దానిని తొలగించే విధానాన్ని డీఫ్రాగ్మెంటేషన్ అంటారు.

విండోస్ లో డీఫ్రాగ్మెంటు చెయ్యడానికి యుటిలిటీలుంటాయి. విండోస్ తో వచ్చే యుటిలిటీ అంత సమర్థవంతంగా డీఫ్రాగ్ చెయ్యదు. తర్డు పార్టీ యూటిలిటీలుంటాయి ఉదా: jkdefrag, Diskeeper వంటివి.

నేను jkdefrag ఉపయోగించాను. డీఫ్రాగ్ అయితే సమర్థవంతంగా అయింది కానీ అయినా పనిచెయ్యలేదు. ఎందుకంటే MBR, Pagefile వంటి వాటిని అది కూడా డీఫ్రాగ్ చెయ్యలేదు కనక. చివరికి Diskeeper అనే సాఫ్టువేరు ఉపయోగించాను. ఇది బూట్ టైం లోనే డీఫ్రాగ్ చేస్తుంది కాబట్టి వాటిని కూడా డీఫ్రాగ్ చెయ్యగలిగింది.

హమ్మయ్య… ఆఖరికి ఎలాగయితే QTParted ఉపయోగించి పార్టీషను ని రీసైజు చెయ్యగలిగాను. ఒక పది జీబీ స్పేసు తో వేరే పార్టీషను ని సృష్టించాను.

తర్వాతదంతా ఈజీనే. కుబుంటు ఇన్స్టాల్ చెయ్యడానికి అక్షరాలా పదిహేను నిముషాలు పట్టింది. తర్వాత అప్డేట్లు ఒక పది నిముషాలు. కావలసిన ఫైర్ఫాక్సు, థండర్బర్డు మొదలయినవి ఇంకో అయిదు నిముషాలు.

మొట్ట మొదట నాకు కావాల్సింది విండోసు లోని డాటా. అది ఒక్క కమాండు దూరం అంతే. ఆ పార్టీషనుని “మౌంటు” చెయ్యగానే డాటా అంతా లభ్యం. ఇంతకు ముందయితే NTFS కి రీడ్ ఓన్లీ సపోర్టు ఉండేది, కానీ ఇప్పుడు “ntfs-3g” డ్రైవరుని కుబుంటు లో ఇంటిగ్రేటు చెయ్యడంతో రీడ్ రైటు సపోర్టు వచ్చేసింది. అంటే మీ విండోసు డ్రైవు ని కూడా మౌంటు చేసి ఆ స్పేసు ని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. (ఇందులో ఉన్న ఒకే చిక్కేమిటంటే ntfs-3g డ్రైవరు విండోసు హైబర్నేటు అయి ఉంటే పని చెయ్యదు.)

ఎలాగూ నాకు కావలసిన ఆఫీసు సాఫ్టువేరు “ఓపెన్ ఆఫీసు” ఇన్స్టాల్ అయే ఉంది. కాబట్టి ఇక కావలసింది మైక్రోసాఫ్టు ఎక్ష్చేంజ్ సర్వరు కి కనెక్టు కావడానికి మెయిల్ క్లైంటు. అవుట్లుక్ కి దగ్గరగా వచ్చే క్లైంటు లినక్సు లో “ఎవల్యూషన్“. అది కాలెండరింగు కూడా సపోర్టు చేస్తుంది.

తర్వాతది మెసెంజరు. పిడ్జిన్ (ఇంతకు ముందు గెయిమ్) ని మించింది ఏది ?

ఇంక నాకు తలెత్తిన సమస్య ఆఫీసు వైరులెస్సు కి కనెక్టు కావడం. మా వైరులెస్సు నెట్వర్కు “EAP-FAST” ఆథెంటికేషను వాడుతుంది. కుబుంటు లో మామూలు అనాథెంటికేటెడ్, లేదా WEP ఆథెంటికేషను సపోర్టు ఉంది కానీ EAP-FAST కి సపోర్టు లేదు. wpasupplicant పాకేజీ ని openssl సపోర్టు తో కంపైల్ చేస్తే పని చేస్తుంది. ఆ పాకేజీని మార్చేంత సీను నాకు లేకపోవడంతో కంపెనీలో ఆ సీనున్న వారితో చేయించి నడపగానే వైరులెస్సు తో కనెక్టయిపోయింది.
(చూసారా “ఓపెన్ సోర్సు” తో లాభాలు. అదే ఏదయినా క్లోస్డ్ సోర్సు ఆపరేటింగు సిస్టమయితే వారు సపోర్టు చేసేదాకా ఆగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడయితే ఎంచగ్గా మనమే సోర్సు మార్చేసుకుని సమస్యను పరిష్కరించుకోవచ్చు.)

ఇక తరవాతది వీపీఎన్ ఆక్సెసు. మా కంపెనీ ఉపయోగించే వీపీఎన్ కి vpnc ఉపయోగించి కనెక్టు కావచ్చు. కానీ వీపీఎన్ కి కనెక్టు కావడానికి వన్‌టైము పాస్వర్డు సృష్టించే ఇంకో సాఫ్టువేరు ని జతగా వాడతారు. ఆ క్లయింటు ఏమో విండోసు మీద పనిచేసేది. ఇక దానికోసం వైన్ ఉపయోగించాల్సొచ్చింది. దాని కమాండు లైను వర్షను ఈఎక్షీ కనుగొని దానికి సంబంధించిన రిజిస్ట్రీ ఎంట్రీలను వైన్ కి జోడించడంతో అది లినక్సులో పనిచెయ్యడం మొదలెట్టింది. కానీ ఇక్కడ ఇంకో సమస్య తెలెత్తింది ఏంటంటే ఈ సాఫ్టువేరు ఒక dat ఫైలు ఉపయోగించుకుంటుంది. అది వన్‌టైము పాస్వర్డు సృష్టించిన ప్రతీ సారీ మారుతుంటుంది. మరి నేను దానిని లినక్సు లో వాడితే మరుసటి సారి అది విండోసు లో పని చెయ్యదు ఎందుకంటే ఆ dat ఫైలు సింక్రనైజు అయి ఉండదు కాబట్టి. దానికి నేనేమి చేసానంటే ఇంతకు ముందు మౌంటు చేసిన విండోసు పార్టీషను లో ఉన్న ఆ ఫైలుకి ఒక సింబాలిక్ లింకు సృష్టించాను. కాబట్టి ఇక ఆ dat ఫైలు మారినా సింక్రనైజ్డు గా ఉంటుందన్నమాట.
ఇక అక్కడితో దాదాపు అన్ని సమస్యలూ తీరినట్టే ఒక్కటి తప్ప.

అదేంటంటే ఇంట్లోంచి మీటింగులు అటెండు కావడానికి మేము “ఐపీ కమ్యూనికేటరు” (సాఫ్టు ఫోను) ఉపయొగిస్తాము. కానీ మేము వాడే ప్రోటోకాలు ఓపెన్ కాదు. కాబట్టి దానికి లినక్సు లో క్లయింటు దొరకలేదు. దానికి ఏదన్నా ప్రత్యామ్నాయం దొరికితే ఇక విండోసు లోకి బూటు చెయ్యాల్సిన అవసరమే లేదు. లేదా కనీసం క్లయింటుని వైను ద్వారా పరిగెత్తించగలిగితే సరిపోతుంది.

అదన్నమాట ఒక ప్రహసనం. ఒక రోజంతా కష్టపడినా సరే మొత్తానికి లినక్సు కి మారిపోవడం చాలా సంతోషాన్నిచ్చింది.

అన్నట్టు ఎవరయినా KDE4 ప్లాస్మా ట్రై చేసారా ? కొత్తగా తయారవుతున్నట్టుంది. మాక్ లాగా డాక్ బార్ అదీనూ… ఆల్రడీ కుబుంటు “హార్డీ” కోసం ఆల్ఫా వర్షను ఇంటిగ్రేట్ అయి ఉంది.

25 thoughts on “విండోసు లాపుటాపు పై లినక్సు… నా తంటాలు…

  1. వావ్ ఇప్పుడు NTFS సపోర్టు కూడా వచ్చేసిందా..క్రితంసారి లాప్టాపును డ్యూయల్ బూటు చేసినప్పుడు నేను ఎక్స్పీ పార్టీషన్ని fat32 కి మార్చాల్సివచ్చింది. నాకూ ఇప్పుడు నా విస్టా లాప్టాప్ని డ్యూయల్ బూట్ చెయ్యాలన్న దురద పుడుతోంది

  2. వావ్ ఇప్పుడు NTFS సపోర్టు కూడా వచ్చేసిందా..క్రితంసారి లాప్టాపును డ్యూయల్ బూటు చేసినప్పుడు నేను ఎక్స్పీ పార్టీషన్ని fat32 కి మార్చాల్సివచ్చింది. నాకూ ఇప్పుడు నా విస్టా లాప్టాప్ని డ్యూయల్ బూట్ చెయ్యాలన్న దురద పుడుతోంది

  3. విండోస్ లినక్స్ కలసి తయారైన వింటక్సు అనేది వచ్చింది.
    కొన్ని విండోస్ ఫీచర్స్ ఎక్కువ లినక్స్ ఫీచర్స్.
    fat32లో విండోస్,ntfs లో ఈ వింటక్సు రెండూ బాగా పని చేస్తున్నాయి. రెండిటిని (C’ drive)ఒకే పార్టిషన్ లో చేసాను. ఏ సమస్యలూ లేవు.

  4. విండోస్ లినక్స్ కలసి తయారైన వింటక్సు అనేది వచ్చింది.కొన్ని విండోస్ ఫీచర్స్ ఎక్కువ లినక్స్ ఫీచర్స్.fat32లో విండోస్,ntfs లో ఈ వింటక్సు రెండూ బాగా పని చేస్తున్నాయి. రెండిటిని (C’ drive)ఒకే పార్టిషన్ లో చేసాను. ఏ సమస్యలూ లేవు.

  5. @anonymous:
    ఇదే వాడమని నే చెప్పట్లేదు అండీ…
    క్లోజ్డ్ మంచిది కాదని కూడా నే ఎక్కడా చెప్పలేదు. ఓపెన్ సోర్స్ ఫిలాసఫీ నాకిష్టం, అందుకనే నే వాడుతున్నా. ఉబుంటు ని విండోస్ కంటే ఎక్కువగా ఇష్టపడతా. అందుకనే అది ఇన్స్టాలు చేసుకున్నా.
    ఎవరికేది పని చేస్తే, ఇష్టమయితే అదే…

    @రవి వైజాసత్య:
    అవును ఎంతో సదుపాయంగా ఉంది NTFS సపోర్టు వచ్చిన తరువాత.
    వెంటనే డ్యూవల్ బూటు కానిచ్చెయ్యండి. దురద తీరుద్ది 🙂

    @విశ్వనాధ్:
    అవునా ? నాకు దాని గురించి తెలీదు. లంకెలేమయినా ఇస్తారా ?
    సెర్చ్ చేసినా సరయిన సమాచారం దొరకలేదు.

  6. @anonymous:ఇదే వాడమని నే చెప్పట్లేదు అండీ…క్లోజ్డ్ మంచిది కాదని కూడా నే ఎక్కడా చెప్పలేదు. ఓపెన్ సోర్స్ ఫిలాసఫీ నాకిష్టం, అందుకనే నే వాడుతున్నా. ఉబుంటు ని విండోస్ కంటే ఎక్కువగా ఇష్టపడతా. అందుకనే అది ఇన్స్టాలు చేసుకున్నా.ఎవరికేది పని చేస్తే, ఇష్టమయితే అదే…@రవి వైజాసత్య:అవును ఎంతో సదుపాయంగా ఉంది NTFS సపోర్టు వచ్చిన తరువాత. వెంటనే డ్యూవల్ బూటు కానిచ్చెయ్యండి. దురద తీరుద్ది :)@విశ్వనాధ్:అవునా ? నాకు దాని గురించి తెలీదు. లంకెలేమయినా ఇస్తారా ?సెర్చ్ చేసినా సరయిన సమాచారం దొరకలేదు.

  7. స్వూర్యుడు గారు (మారు పేర్లకు గారు తగిలించడం వింతగా ఉంటుంది :):

    వాటి గురించి తెలుసు. నేను vmware ఎక్కువగా వాడతాను. లినక్సు మీద కూడా చక్కగా పని చేస్తుంది.
    ఇవి కూడా ఒక ఆల్టర్నేటీవ్.

    నేనింతకు ముందు దాని గురించి ఒక టపా రాసాను.

  8. స్వూర్యుడు గారు (మారు పేర్లకు గారు తగిలించడం వింతగా ఉంటుంది :):వాటి గురించి తెలుసు. నేను vmware ఎక్కువగా వాడతాను. లినక్సు మీద కూడా చక్కగా పని చేస్తుంది.ఇవి కూడా ఒక ఆల్టర్నేటీవ్.నేనింతకు ముందు దాని గురించి ఒక టపా రాసాను.

  9. you don’t have to add any suffixes to my nickname 🙂

    I am sure, you might be aware of all these technologies as you are in IT industry. My intention is not to teach or preach but to suggest that there is a way to use both Linux and Windows at the same time with out rebooting and getting the best of both the worlds 😉

    I did not mention vmware in my previous post intentionally as you have expressed your love for open source and took such a pain to get things working on Linux. ;). NOt sure how things will change after Citrix takeover of XenSource 😦

    In very near future, we may get this technology for free from MS(VS) or VirtualPC (or whatever it is :)) as a ploy to kill vmware. Then we may not need any other alternatives 😀

    ~sUryuDu~

  10. you don’t have to add any suffixes to my nickname :)I am sure, you might be aware of all these technologies as you are in IT industry. My intention is not to teach or preach but to suggest that there is a way to use both Linux and Windows at the same time with out rebooting and getting the best of both the worlds ;)I did not mention vmware in my previous post intentionally as you have expressed your love for open source and took such a pain to get things working on Linux. ;). NOt sure how things will change after Citrix takeover of XenSource :(In very near future, we may get this technology for free from MS(VS) or VirtualPC (or whatever it is :)) as a ploy to kill vmware. Then we may not need any other alternatives :D~sUryuDu~

  11. @సూర్యుడు: ఐతే ఓకే 🙂

    నేను మీ సజెషన్ ని తప్పుగా అర్థం చేసుకోలేదు. నాకు వాటి గురించి అవగాహన ఉంది అని చెప్పాను అంతే.

    అవును వర్చువలైజేషను మంచి ఆప్షనే. సాధ్యమయినంత వరకూ లినక్సు లోనే ఆల్టర్నేటీవ్స్ వెతకడం నా మొదటి ప్రయారిటీ. సాధ్యం కాకపోతే దీనిని ఆశ్రయించక ఎలాగూ తప్పదు.

    vmware నేను వాడడానికి కూడా కారణం ఉంది. విండోస్ మీద virtual pc, virtual server ప్రయత్నించి చూసాను. అవి పని చెయ్యలేదు నాకు. మొదటి నుంచీ vmware అద్భుతంగా పని చేస్తుంది.
    దానిని లినక్సు మీద ప్రయత్నించాను. అక్కడ కూడా అంతే బాగా పని చేస్తుంది. xen మీద అంత ఎక్కువ సమయం గడపలేదు నేను. దాని మీద ఎక్స్పీరియన్సు చెప్పలేను. ఇంతకు ముందు ప్రయత్నించాను కానీ దాని సెటప్ vmware లాగా అవుటాఫ్ ది బాక్సు కాదు.

    virtual pc, virtual server రెండూ ఇప్పటికే ఉచితం. అవి చాలా నాళ్ళ నుంచి ఉన్నాయి కానీ వాటి మార్కెట్టు అంతంత మత్రమే. vmware దే ఎక్కువ వాటా అనుకుంట. మైక్రోసాఫ్టు అంత కంటే మంచి సొల్యూషను తో వస్తే కానీ ప్రస్తుతమున్న ఆల్టర్నేటీవ్స్ ను బీట్ చెయ్యలేదు.

  12. @సూర్యుడు: ఐతే ఓకే :)నేను మీ సజెషన్ ని తప్పుగా అర్థం చేసుకోలేదు. నాకు వాటి గురించి అవగాహన ఉంది అని చెప్పాను అంతే.అవును వర్చువలైజేషను మంచి ఆప్షనే. సాధ్యమయినంత వరకూ లినక్సు లోనే ఆల్టర్నేటీవ్స్ వెతకడం నా మొదటి ప్రయారిటీ. సాధ్యం కాకపోతే దీనిని ఆశ్రయించక ఎలాగూ తప్పదు.vmware నేను వాడడానికి కూడా కారణం ఉంది. విండోస్ మీద virtual pc, virtual server ప్రయత్నించి చూసాను. అవి పని చెయ్యలేదు నాకు. మొదటి నుంచీ vmware అద్భుతంగా పని చేస్తుంది.దానిని లినక్సు మీద ప్రయత్నించాను. అక్కడ కూడా అంతే బాగా పని చేస్తుంది. xen మీద అంత ఎక్కువ సమయం గడపలేదు నేను. దాని మీద ఎక్స్పీరియన్సు చెప్పలేను. ఇంతకు ముందు ప్రయత్నించాను కానీ దాని సెటప్ vmware లాగా అవుటాఫ్ ది బాక్సు కాదు.virtual pc, virtual server రెండూ ఇప్పటికే ఉచితం. అవి చాలా నాళ్ళ నుంచి ఉన్నాయి కానీ వాటి మార్కెట్టు అంతంత మత్రమే. vmware దే ఎక్కువ వాటా అనుకుంట. మైక్రోసాఫ్టు అంత కంటే మంచి సొల్యూషను తో వస్తే కానీ ప్రస్తుతమున్న ఆల్టర్నేటీవ్స్ ను బీట్ చెయ్యలేదు.

  13. * వింటక్సు దొరకటం కొంచెం కష్టమేనండి. అదొక జంబర్ సాప్ట్ వేర్. ఎలాగంటే హాకింగ్ ద్వారా వచ్చిన సాప్ట్వేర్. దానినీ దీనినీ మిక్సింగ్ చేసి అనక కొంచెం బాక్సింగ్ చేసి తయారు చేసిన కిచిడీ. దానికి లింకులు దొరకవు. డైరెక్టుగా మాత్రమే లభ్యం .

  14. * వింటక్సు దొరకటం కొంచెం కష్టమేనండి. అదొక జంబర్ సాప్ట్ వేర్. ఎలాగంటే హాకింగ్ ద్వారా వచ్చిన సాప్ట్వేర్. దానినీ దీనినీ మిక్సింగ్ చేసి అనక కొంచెం బాక్సింగ్ చేసి తయారు చేసిన కిచిడీ. దానికి లింకులు దొరకవు. డైరెక్టుగా మాత్రమే లభ్యం .

  15. Hi,
    i have seen your blog its interesting and informative.
    I really like the content you provide in the blog.
    But you can do more with your blog spice up your blog, don’t stop providing the simple blog you can provide more features like forums, polls, CMS,contact forms and many more features.
    Convert your blog “yourname.blogspot.com” to http://www.yourname.com completely free.
    free Blog services provide only simple blogs but we can provide free website for you where you can provide multiple services or features rather than only simple blog.
    Become proud owner of the own site and have your presence in the cyber space.
    we provide you free website+ free web hosting + list of your choice of scripts like(blog scripts,CMS scripts, forums scripts and may scripts) all the above services are absolutely free.
    The list of services we provide are

    1. Complete free services no hidden cost
    2. Free websites like http://www.YourName.com
    3. Multiple free websites also provided
    4. Free webspace of1000 Mb / 1 Gb
    5. Unlimited email ids for your website like (info@yoursite.com, contact@yoursite.com)
    6. PHP 4.x
    7. MYSQL (Unlimited databases)
    8. Unlimited Bandwidth
    9. Hundreds of Free scripts to install in your website (like Blog scripts, Forum scripts and many CMS scripts)
    10. We install extra scripts on request
    11. Hundreds of free templates to select
    12. Technical support by email

    Please visit our website for more details http://www.HyperWebEnable.com and http://www.HyperWebEnable.com/freewebsite.php

    Please contact us for more information.

    Sincerely,

    HyperWebEnable team
    info@HyperWebEnable.com

  16. Hi, i have seen your blog its interesting and informative.I really like the content you provide in the blog.But you can do more with your blog spice up your blog, don’t stop providing the simple blog you can provide more features like forums, polls, CMS,contact forms and many more features.Convert your blog “yourname.blogspot.com” to http://www.yourname.com completely free.free Blog services provide only simple blogs but we can provide free website for you where you can provide multiple services or features rather than only simple blog.Become proud owner of the own site and have your presence in the cyber space.we provide you free website+ free web hosting + list of your choice of scripts like(blog scripts,CMS scripts, forums scripts and may scripts) all the above services are absolutely free.The list of services we provide are1. Complete free services no hidden cost2. Free websites like http://www.YourName.com3. Multiple free websites also provided4. Free webspace of1000 Mb / 1 Gb5. Unlimited email ids for your website like (info@yoursite.com, contact@yoursite.com)6. PHP 4.x7. MYSQL (Unlimited databases)8. Unlimited Bandwidth9. Hundreds of Free scripts to install in your website (like Blog scripts, Forum scripts and many CMS scripts)10. We install extra scripts on request11. Hundreds of free templates to select12. Technical support by emailPlease visit our website for more details http://www.HyperWebEnable.com and http://www.HyperWebEnable.com/freewebsite.phpPlease contact us for more information.Sincerely,HyperWebEnable teaminfo@HyperWebEnable.com

  17. నా system లొ ఉటుంబు install చేసాను నాది vista 64bit
    నేను movie లొ graphics చేస్తాను నా దాంట్లొ photoshop install ఐంది కాని Maya and Digital Fusion softwares install కావటలేదు ఇవి ఏలా install చైయాలి దయచేసి చేప్పండి

    B.Kameshwarara

Leave a reply to ప్రవీణ్ గార్లపాటి స్పందనను రద్దుచేయి